ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటంలో చంద్రబాబు దిట్ట.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

by Dishafeatures2 |
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటంలో చంద్రబాబు దిట్ట.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ నుంచి గెలుపొంది వేరే పార్టీకి ఓటేయడం దుర్మార్గమన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ముందు వారు తమ పదవులకు ముందుగా రాజీనామా చేసి పార్టీలు మారాలనే నైతిక బాధ్యతను విస్మరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి భారతదేశంలోనే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ఆనాడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడని గుర్తు చేశారు.

మంగళగిరి పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డులో వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. నేడు ఒక్కో ఎమ్మెల్యే కు రూ.15 నుండి 20 కోట్ల రూపాయలు ఇస్తామంటూ మరోసారి చంద్రబాబు ప్రలోభాలకు గురి చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు తిలోదకాలిచ్చారని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి ప్రజాస్వామ్యం నుంచి గెలవలేక గెలిచిన అభ్యర్థులను అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుక్కోవాలని ఆలోచన అన్యాయమన్నారు.

రాజధాని ప్రాంతమైన తాటికొండ ప్రజలు, మంగళగిరి ప్రజలు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ ను తెలుసుకుని ఈ ప్రాంతాల్లో వైసీపీకి పట్టంకట్టారని గుర్తు చేశారు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేశ్‌ పోటీ చేసినా డబ్బు అధికారం అన్ని ఉన్నా కూడా రాజధాని అమరావతిలో చేసిన అవినీతిని చూసి ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఎవరితో ఎటువంటి పొత్తులు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేరని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.



Next Story

Most Viewed