అంబేద్కర్ విగ్రహాలు వద్దు.. రాజ్యాధికారం కావాలి.. కేఏ పాల్

by Dishafeatures2 |
అంబేద్కర్ విగ్రహాలు వద్దు.. రాజ్యాధికారం కావాలి.. కేఏ పాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ విగ్రహాలు వద్దని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వీధి వీధికి మనల్ని మోసం చేయడానికి నేటీ రాజకీయ నాయకులు అంబేద్కర్ విగ్రహాలు కడుతున్నారని విమర్శించారు. 75 ఏళ్లుగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చిందా అని ప్రశ్నించారు. హైదరాబద్‌లో అక్టోబర్ 1న ప్రపంచ శాంతి సభకు, అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్‌కు పర్మిషన్ ఇవ్వాలని, అలాగే సభకు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, సీఎం జగన్ రావాలని అన్నారు.

అనేక మంది ఈ సమ్మిట్‌కు రావాలని సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఈ సమ్మిట్ నిర్వహించడం వల్ల లక్షల మందికి ఉద్యోగాలు, గ్రామ సమస్యల పరిష్కారం జరుగుతుందని పేర్కొన్నారు. పాలకులు లక్షల కోట్లు అప్పులు చేసి తెలుగు రాష్టాలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎలక్షన్ తర్వాత తెలుగు రాష్ట్రాలు శ్రీలంకగా సంక్షోభంలోకి పోతుందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని అన్నారు.



Next Story

Most Viewed