రాష్టంలో ప్రాజెక్టుల నిర్మాణంలో సీఎం కేసీఆర్ కుట్ర: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Disha Web Desk 11 |
రాష్టంలో ప్రాజెక్టుల నిర్మాణంలో సీఎం కేసీఆర్ కుట్ర: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ, జడ్చర్ల: రాష్టంలో ప్రాజెక్టుల నిర్మాణంలో సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, 2013 భూ సేకరణ చట్టాన్నిఅమలు చేయడం లేదని రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండపూర్ రిజర్వాయర్ ను ఆయన బుధవారం పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణం వద్ద భూ నిర్వాసితులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భూ నిర్వాసితులకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్టం చెప్పినట్లుగా ముంపునకు గురవుతున్న భూములకు మార్కెట్ విలువను లెక్కలోకి తీసుకొని, దానికి మూడింతలు రెట్టింపు ధర చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది కాకపోతే భూమికి భూమి ఇవ్వాలని చట్టం స్పష్టంగా చెప్పిందని, ఇదే విషయమై ముంపు బాధితులు కోర్టును ఆశ్రయించగా, బలవంతంగా ప్రభుత్వమే మొక్కుబడి పరిహారం చెల్లించి రైతులను బెదిరించి భూములు గుంజుకున్నట్లు తమతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. వల్లూరు గ్రామానికి చెందిన ఓ రైతుకు సంబంధించి 5 ఎకరాలు ఉండగా, ధరణిలో కేవలం 18 గుంటలు మాత్రమే చూపుతుందని తెలిపారు. మిగిలిన భూమి ప్రొహిబిటెడ్ ల్యాండ్ అన్నట్లు చూపడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రాజెక్టులు అనుకున్న గడువులోగా పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.



Next Story