బ్రేకింగ్.. మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన కోమటిరెడ్డి.. ఏం జరుగుతోంది.?

by Shamantha N |
Komatireddy,-Kishan-Reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం కలిశారు. భువనగిరిలో పర్యాటక అభివృద్ధి అంశాలపై కిషన్ రెడ్డితో చర్చించినట్టు కోమటిరెడ్డి తెలిపారు. అయితే, అంతకుముందు పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. తెలుగు వారికి, దేశానికి పేరు తెచ్చేలా పనిచేయాలని కిషన్ రెడ్డిని ఈ సందర్భంగా కోరారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

అయితే, నిజానికి రేవంత్ రెడ్డిని టీపీసీసీగా నియమించిన తరువాత వెంకటరెడ్డి అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక నుంచి తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనని ప్రకటించారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తానని, హైదరాబాద్‌లో కూర్చుంటే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారం కావంటూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అయితే, ఢిల్లీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. శనివారం సైతం ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ఇదిలావుంటే.. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిమాణామాల నేపద్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Komatireddy-VenkatReddy,-Ki

Advertisement

Next Story

Most Viewed