బయట తిరిగే వారికి హెచ్చరిక.. నేరుగా ఐసోలేషన్‌కే

by  |
బయట తిరిగే వారికి హెచ్చరిక.. నేరుగా ఐసోలేషన్‌కే
X

దిశ, వేములవాడ: ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను తీస్తూ కుటుంబాలను విచ్చిన్నం చేస్తుంటే.. మరికొంతమంది అవేమీ పట్టనట్లు, కరోనాతో తమకు సంబంధం లేదన్నట్లు లాక్ డౌన్ నిబంధనలను గాలికి వదిలి బలాదూరుగా బయట తిరుగుతూ కరోన వ్యాప్తికి కారణమవున్నారు. ఇలాంటి వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వెంకటేశ్ అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ సడలింపు సమయం దాటిన 10 గంటల తర్వాత చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్ తనిఖీలలో అకారణంగా, కుంటిసాకులతో బయట తిరుగుతూ కనబడితే, వారిని అదుపులోకి తీసుకుని వాహనం సీజ్ చేస్తామనన్నారు.

చట్టప్రకారం ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ ల కింద కేసు నమోదు చేస్తామన్నారు. జప్తు చేసిన వాహనాన్ని కోర్టులో డిపాజిట్ చేస్తామన్నారు. ఆకారణంగా తిరుగుతూ పట్టుబడిన వ్యక్తులను ప్రభుత్వ ఆధీనంలో నడుపబడుతున్న ఐసోలేషన్ సెంటర్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైద్య పరీక్షలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే, నెగిటివ్ రిపోర్ట్ వచ్చేవరకు ఐసొలేషన్ సెంటర్ లోనే చికిత్స అందిస్తూ, నిర్బంధంలో ఉంచడం జరుగుతుందన్నారు. కరోనా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినవారికి వైద్యులు, మానసిక విశ్లేషకులతో కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపడం జరుగుతుందన్నారు.



Next Story

Most Viewed