పరిస్థితులు బాగాలేవ్ మేం పర్మిషన్ ఇయ్యం సార్.. అయితే ఇక్కడే నడిరోడ్డుపై కూర్చుంటా

by  |
MLA-RURAL1
X

దిశ, ఏపీ బ్యూరో: మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు గురువారం ఉదయం 8గంటలకు దీక్ష చేపట్టారు. వైసీపీ దాడులను నిరసిస్తూ 36 గంటలపాటు ఈ దీక్ష కొనసాగనుంది. అయితే ఈ దీక్షలో పాల్గొనేందుకు మాజీమంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇతర కార్యకర్తలతో కలిసి చలో అమరావతి అంటూ ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఏలూరు టోల్ గేట్ వద్ద గోరంట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఎమ్మెల్యే గోరంట్లకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తాను సచివాలయానికి వెళ్తున్నానని తనను అడ్డుకోవడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని బుచ్చయ్య చౌదరి పోలీసులతో వాదించారు. రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవని అందువల్ల అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. వాహనాన్ని పక్కన పెట్టాలంటూ కోరారు. అందుకు ఎమ్మెల్యే గోరంట్ల నిరాకరించారు. తనకు పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డుపై కూర్చుని నిరసన తెలియజేస్తానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.



Next Story