సీఎం జిల్లాలో పవర్ ప్రాబ్లం! ఓట్లు వేయకుండా ఆందోళన

by Ramesh N |
సీఎం జిల్లాలో పవర్ ప్రాబ్లం! ఓట్లు వేయకుండా ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలోని ఓ గూడెంలో మూడు రోజులుగా కరెంటు లేకపోవడంతో ఓట్లు వేయకుండా ఓటర్లు ధర్నా చేపట్టారు. మూడు రోజుల నుంచి గూడెంలో కరెంటు లేకపోవడంతో చెంచులు ఓట్లు వేయకుండా ఆందోళన చేపట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం చెంచులు ఓట్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరించి ఆందోళన చేపట్టారు.

గత మూడు రోజుల నుంచి కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఫైర్ అయ్యారు. చెంచులమని మమ్ములను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి, రేషన్ కార్డులు లాంటి సమస్యలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నల్లమల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయని, కరెంట్ లేకపోవడంతో పాముకాటుకు గురి కావాల్సివస్తుందని వారు చెప్పారు. విద్యుత్ అధికారులు కరెంటు బిల్లులు అడుగుతారు కానీ విద్యుత్ మాత్రం ఇవ్వటం లేదని చెంచులు వెల్లడించారు. ఈ క్రమంలోనే హుటాహుటిన విద్యుత్ అధికారులు చెంచు గూడెంకు చేరుకున్నారు.

Next Story