కామారెడ్డి కలెక్టర్‌కు షాకిచ్చిన హైదరాబాద్‌ పోలీసులు

by  |
Challans
X

దిశ, తెలంగాణ బ్యూరో : వాహనదారులు నిత్యం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తూనే ఉంటారు. అలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేయడం చూస్తుంటాం. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. ఇది సాధారణ పౌరుడుకి మామూలే అయినప్పటికీ అన్ని తెలిసిన, ప్రభుత్వ యంత్రాంగంలో కీలకంగా వ్యవహరించే ఓ జిల్లా ఉన్నతాధికారి వాహనంపై 13 చలాన్లు పెండింగ్ ఉండటం గమనార్హం.

కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనంపై ట్రాఫిక్ ఈ-చలాన్లు పడ్డాయి. ఔటర్ రింగు రోడ్డుపై ఓవర్ స్పీడ్‌గా వెళ్లినందుకు, జిబ్రా లైన్ క్రాస్ చేసినందుకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిమానాలు విధించారు. 2019 నుంచి 2021 ఆగస్టు వరకు ఏకంగా13 చలాన్లు పడగా.. ఇందుకు రూ.12,555 జరిమానా పడింది. ఇప్పటి వరకు వాటిని క్లియర్ చేయకపోవడం గమనార్హం.

Traffic Police Challans


Next Story