రైతులపై పోలీసుల లాఠీచార్జ్ అరాచకానికి పరాకాష్ట.. చంద్రబాబు

by  |
babu
X

దిశ, ఏపీ బ్యూరో: రాజధాని అమ‌రావ‌తి కోసం కోర్టు అనుమతితో రైతులు మహాపాదయాత్ర చేస్తుంటే, కక్షగట్టి ఆపడానికి ప్రభుత్వం స‌వాల‌క్ష కారణాలు వెదుక్కుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రైతుల‌పాద‌యాత్ర అంటే ఎందుకంత భయమని చంద్రబాబు ప్రశ్నించారు. ఉద్యమంలా ఆరంభ‌మై ఉధృత‌మైన పాద‌యాత్రని అడుగ‌డుగునా అడ్డుకునేందుకు.. స‌ర్కారు వేయ‌ని ఎత్తుగ‌డ లేదు, పోలీసులు చేయ‌ని కుట్రలేదు అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వ‌చ్చిన రైతుల‌పై పోలీసుల లాఠీచార్జ్ అరాచ‌కానికి ప‌రాకాష్ట అని మండిపడ్డారు.

ఎండను, వానను లెక్కచేయకుండా మ‌హాపాదయాత్రను క‌వ‌ర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల‌పై పోలీసు జులుం ప్రదర్శిస్తున్నారని.. దానిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మ‌హాపాద‌యాత్రకి వెల్లువెత్తుతున్న ప్రజామ‌ద్దతుని మీడియా బ‌య‌టి ప్రపంచానికి చూపిస్తోంద‌నే అక్కసుతో మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారని చంద్రబాబు ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.


Next Story

Most Viewed