కొత్త వ్యాపారానికి లోన్ కావాలా..

by Harish |   ( Updated:2021-11-29 06:28:58.0  )
msme
X

దిశ, వెబ్‌డెస్క్: మీరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నా, లేదా ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నా మీ దగ్గర డబ్బులు లేవని బాధపడకండి. కేంద్ర ప్రభుత్వం మీలాంటి వాళ్ళ కోసమే PMEGP (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన) అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. (MSME) సూక్ష్మ, చిన్న & మధ్య తరహా సంస్థలు ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి లేదా కొత్తగా వ్యాపారాన్ని మెుదలు పెట్టేవాళ్ళకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయంగా లోన్ లు ఇస్తారు.

PMEGP ద్వారా వివిధ రకాల వ్యాపారాలకు పరిమితి గల లోన్‌లు మంజూరు చేస్తారు. తయారీ రంగం వ్యాపారాలకు గరిష్టంగా రూ.25 లక్షలు,సేవారంగం వ్యాపారాలకు రూ.10 లక్షలు లోన్ లు ఇస్తారు. బ్యాంక్ నుండి 60%,75% లోన్ వస్తుంది. మిగిలిన 15%-35% PMEGP పథకం ద్వారా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కొత్త వ్యాపారాలు, స్టార్టప్‌లు, స్వయం ఉపాధి ప్రాజెక్టులు వ్యాపార వృద్ధి ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

PMEGP లోన్ కోసం అవసరమైన పత్రాలు

పాన్ కార్డ్
ఆధార్ కార్డు
కుల ధృవీకరణ పత్రం
ప్రాజెక్ట్ నివేదిక
రూరల్ ఏరియా సర్టిఫికెట్
విద్యా అర్హత సర్టిఫికేట్
ఏదైనా ఇతర ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ (అవసరం అనుకుంటే)
స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్
PMEGP పథకం లోన్ పూచీకత్తు

10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. ఆ పైన లోన్‌కు మాత్రం కొంత హామీని ఇవ్వాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 11% నుండి 12% p.a.గా ఉంటుంది.

PMEGP పథకానికి అర్హత

వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.
రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువ గల ప్రాజెక్ట్ కోసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
PMEGP పథకాన్ని ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) నిర్వహిస్తుంది. పూర్తి సమాచారం కోసం kviconline.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Read more : ఒమిక్రాన్‌పై సమరం.. కేబినెట్ సబ్ కమిటీ సిద్ధం

Advertisement

Next Story