కేదార్‌నాథ్ పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌పై ప్రధాని సమీక్ష

by  |
కేదార్‌నాథ్ పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌పై ప్రధాని సమీక్ష
X

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ అభివృద్ధి, పునర్నిర్నాణ ప్రాజెక్ట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, ఇతర సీనియర్ అధికారులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాల పరీక్షకు నిలిచే విధంగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పవిత్ర స్థలాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలను రూపకల్పన చేయాలని సూచించారు. ప్రాజెక్టులను ఎకో ఫ్రెండ్లీగా, ప్రకృతితో ఐక్యమయ్యేలా చేపట్టాలని తెలిపారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు, పవిత్ర స్థలాలకు వచ్చే పర్యాటకులు, యాత్రికుల రద్దీ తక్కువగా ఉండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని వెల్లడించారు. కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసేలా చూడాలన్నారు. కేదార్‌నాథ్‌కు తగిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని రామ్‌బన్ నుంచి కేదారినాథ్ వరకూ వెళ్లే మార్గంలో వారసత్వ, మతపరమైన ప్రదేశాలను మరింత అబివృద్ధి చేయడంపైనా దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఈ సమీక్షకు సంబంధించిన విషయాలను ప్రధాని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.



Next Story

Most Viewed