Happy New Year లింక్‌పై క్లిక్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త

by  |
Happy New Year లింక్‌పై క్లిక్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
X

దిశ, డైనమిక్ బ్యూరో : సోషల్ మీడియాకు ఆకర్షితులైన ప్రజలు ఏ లింక్స్ వచ్చినా క్లిక్ చేయడం.. అందులో దాగి ఉన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. అయితే, అవి ఎంతగానో ప్రమాదకరమని ఎథికల్ హ్యాకర్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏదైనా మొబైల్‌ను హ్యాక్ చేయాలంటే ప్రత్యక్షంగా మొబైల్ యూజర్ నుంచి సపోర్ట్ ఉండాల్సిందేనని వారు చెబుతున్నారు. అందుకోసం యూజర్స్‌కు సంబంధం లేనివి, డిస్కౌంట్ ఆఫర్ల పేరుతో లింక్‌ను మెసేజ్‌ చేస్తారు. ఆ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా సంబంధిత మొబైల్ యాక్సెస్, మొబైల్ డేటా హ్యాకర్ చేతిలోకి వెళ్లిపోతుంది.

అయితే, సైబర్ నేరాలు పెరగడంతో పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఓటీపీలు, లింక్స్‌ను మొబైల్ యూజర్స్ క్లిక్ చేసేందుకు వెనకడుగేస్తున్నారు. దీంతో హ్యకర్స్ మరో ఎత్తుగడ ఎంచుకున్నట్లు ఎథికల్ హ్యకర్స్ హెచ్చరిస్తున్నారు. పండుగలు, వేడుకలు వస్తే చాలు తమ పేరుతో విషెస్ పంపడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో తమ పేరుతో విషెస్‌ను క్రియేట్ చేసి ఆ లింక్‌ను సన్నిహితులకు, బంధువులకు పంపిస్తుంటారు. అయితే, ఆ లింక్‌ను క్లిక్ చేయడం మహా ప్రమాదకరమని ఎథికల్ హ్యకర్స్ చెబుతున్నారు. లింక్ క్లిక్ చేయగానే బ్యాగ్రౌండ్‌లో సెల్ఫీ కెమెరా ఓపెన్ అవుతుందని, ఫోన్ గ్యాలరీ, కాంటాక్ట్స్ అన్నీ హ్యాకర్స్ చేతిలోకి వెళ్లిపోతాయని హెచ్చరిస్తున్నారు. అది తెలియక ప్రతి ఒక్కరూ లింక్ క్రియేట్ చేసి అందరికీ పంపించి ఇబ్బందుల్లో పడేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో రానున్న న్యూయర్ నేపథ్యంలో ఇలాంటివి చేసి ఇబ్బందుల్లో పడొద్దని మొబైల్ యూజర్స్‌కు పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed