విద్యాసంస్థలు మూసివేత సరికాదు

by  |
PDSU union
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, పునరాలోచించి 9వ తరగతి నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు ప్రారంభించాలని పీడీ‌ఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక విద్యాశాఖ కార్యదర్శి చిత్ర రామచంద్రన్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. 1వ తరగతి నుంచి 8 వరకు మినహాయింపు ఇచ్చి, ఆపై తరగతులను కరోనా నిబంధనలకు లోబడి యథావిధిగా నడపాలన్నారు.

ఇప్పటికే డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, బార్లు రెస్టారెంట్లు యథేచ్ఛగా నడుస్తున్నాయన్నారు. వాటిపై కన్నెత్తి కూడా చూడకుండా ప్రభుత్వం కేవలం విద్యాసంస్థలు మూసివేయడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ విద్యా సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ 6.7 శాతం సరిపోదని దీన్ని సవరించి విద్యారంగానికి అధిక నిధులు 30 శాతం కేటాయించాలని కోరారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య వైస్ ఛాన్సలర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు.



Next Story

Most Viewed