నేను రానా బిడ్డా.. సర్కారు దవాఖానకు!

by  |
నేను రానా బిడ్డా.. సర్కారు దవాఖానకు!
X

దిశ, కరీంనగర్ : ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’ అనే జనం నేడు కేవలం అటు వైపు మాత్రమే అడుగులేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిన్న, మొన్నటి వరకు నిరుపేదలకే పెద్ద దిక్కుగా సర్కారు ఆస్పత్రులుండేవి. ఇప్పుడు ఉన్నత వర్గాలవారు కూడా దాని ఒడికి చేరుకుంటున్నారు.నోవెల్ కరోనా వైరస్ ( కోవిడ్ 19 ) ప్రబలడంతో కరీంనగర్ నగరంలోని ప్రైవేటు దవాఖానాలు మూతపడ్డాయి. దీంతో అనారోగ్యానికి గురైనవారు సర్కారు దవాఖానకే వెళ్తున్నారు.

లాక్‌డౌన్‌లోనూ రోజూ 200 మంది..

కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, దండెపల్లి ప్రాంతాలకు చెందిన పేషెంట్లు వచ్చేవారు. నిత్యం ఓపీకి 500 మంది పేషెంట్లు వచ్చేవారు. అయితే, లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల నుంచి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ ఈ ఆస్పత్రికి రోజూ 200 మంది ఔట్ పేషెంట్లు చికిత్స చేయించుకునేందు వస్తున్నారు. ఇందులో కరీంనగర్ నగరానికి చెందినవారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు.

ఎమర్జెన్సీ మాత్రమే..

కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు కేవలం ఎమర్జెన్సీ కేసులను మాత్రమే చూస్తున్నారు. కొవిడ్ 19 కారణంగా ఈ ఆస్పత్రిలోప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డు ఏర్పాటు చేయడంతో అత్యవసరంగా చికిత్స అవసరమున్న పేషెంట్లను మాత్రమే పరీక్షిస్తున్నారు. కరోనా సంబంధిత లక్షణాలు ఉన్న పేషెంట్లను కూడా ఐసోలేషన్‌లోనే చికిత్స అందించే ఏర్పాటు చేశారు. 4 రోజుల నుంచి ప్రైవేటు ఆస్పత్రిలో ఓట్ పేషెంట్లకు చికిత్స కల్పించే వెసులుబాటు కల్పించారు అధికారులు. అయినప్పటికీ పేషెంట్లు మాత్రం ప్రైవేటు ఆస్పత్రులకు అంతగా వెళ్లడం లేదు.

Tags: Patients, Govt Hospitals, admit, no private hospitals, covid 19, affect, lockdown

Next Story

Most Viewed