ఆయన కోపం వచ్చినప్పుడు దుర్వాసనుడు.. వరమిచ్చేటప్పుడు విశ్వామిత్రుడు’

by  |
ఆయన కోపం వచ్చినప్పుడు దుర్వాసనుడు.. వరమిచ్చేటప్పుడు విశ్వామిత్రుడు’
X

కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుతో ఉన్న అనుబంధం చాలా గొప్పదన్నారు రచయిత పరుచూరి గోపాల కృష్ణ. తనతో ప్రయాణం గొడవతోనే మొదలైనా.. ఆ తర్వాత సొంత అన్నదమ్ముల కన్నా గొప్పగా కలిసిపోయామని చెప్పారు. నాకు ఏ కష్టమొచ్చినా నేను ముందుగా తలచుకునే పేరు మోహన్ బాబు మాత్రమేనన్న పరుచూరి.. తనను అగ్రజ అని ఆత్మీయంగా పలకరించే మోహన్‌బాబుతో ఈ బంధం కలకాలం కొనసాగాలని కోరుకున్నారు.

‘ఒక సినిమాకు స్క్రిప్ట్ పని పూర్తిచేసి.. వేరే పని మీద ఊరెళ్లాను. ఆ స్క్రిప్ట్‌కు విజయ్ కాంత్, చిరంజీవి అయితే బాగుంటుందని చెప్పినా.. నేను తిరిగొచ్చేసరికి మోహన్ బాబు, మరో నటుడు ఆ పాత్రలను చేశారు. పైగా రచయితగా నన్ను తొలగించి మోహన్ బాబు మరొకరిని పెట్టుకోవడంతో బాధపడినట్టు’ చెప్పారు పరుచూరి. ఆ తర్వాత కూడా మోహన్‌బాబు సినిమాలకు పనిచేసినా.. ఎందుకో ఆ బాధ మాత్రం అలాగే ఉండిపోయిందట. అయితే ఒకరోజు సురేష్ బాబు గెస్ట్ హౌజ్‌లో కలిసినప్పుడు నీ కెరియర్ డౌన్‌లో ఉందని మోహన్‌‌బాబుతో అంటే.. అయితే నువ్వు లేపగలవా ? అని అడిగారంట మోహన్ బాబు. అలా.. అసెంబ్లీ రౌడీ స్క్రిప్ట్‌కు శ్రీకారం చుట్టారట పరుచూరి. ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఆ రోజు రాత్రి అగ్రజ అని సంభోదించిన మోహన్ బాబు.. ఇప్పటికీ తనను అదే పిలుపుతో పలకరిస్తారని పరుచూరి ఆనందం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత కొంతకాలానికి మోహన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తుంటే.. వద్దని చెప్పి మోహన్‌బాబు కోసం ‘రౌడీ గారి పెళ్లాం’ కథ రాశారంట. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ స్వయంగా వచ్చి ఆశీర్వదించారని చెప్పారు. ‘మోహన్‌బాబులో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారని, కోపం వచ్చినప్పుడు దుర్వాసనుడు.. వరమిచ్చేటప్పుడు అద్భుతమైన విశ్వామిత్రుడు’ అని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed