హుజురాబాద్‌లో ‘ఈసీ’ రూల్స్ నుంచి తప్పించుకునేందుకు పార్టీల మాస్టర్ ప్లాన్.!

by  |
Huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్న రాజకీయ పార్టీలు హుజురాబాద్‌లో పక్క జిల్లావైపు చూడటానికి కారణాలు ఏంటీ అన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు ఓ చోట ఉంటే మరో చోట ప్రచార సభలు నిర్వహించడం వెనక ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది. దీని వెనక రహస్యం వేరే దాగి ఉన్నట్టుగా అర్థం అవుతోంది.

పెంచికల్‌పేటే ఎందుకు.?

హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఈ సెగ్మెంట్ పరిధిలో అయితే కొవిడ్ నిబంధనలు పాటించలేదన్న కారణంగా కేసుల్లో ఇరుక్కుంటామని భావిస్తున్న పార్టీలు పక్క ప్రాంతాలపై దృష్టి సారించారు. అయితే, ప్రచార సభలను పొరుగునే ఉన్న పెంచికల్‌పేటలో నిర్వహించడం వెనక మరో కోణం కూడా దాగి ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ఎన్నికల నిబంధనలే కాదు, అభ్యర్థి ఖాతాలో ఖర్చులు కూడా పడకుండా ఉంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ సభలు నిర్వహిస్తే అటు కొవిడ్ నిబంధనలు పాటించలేదని, అనుమతికి మించి జనసమీకరణ జరిపారంటూ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక్కో సభకు ఖర్చు ఎంతో అంచనా వేసి ఎన్నికల అధికారులు అభ్యర్థి ఖాతాలో వేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ఖర్చు అయినట్టుగా చూపిస్తే క్యాండెట్‌కు ఇబ్బందులు తప్పవని భావించే పెంచికల్‌పేట్‌ను ఎంచుకున్నట్టుగా స్పష్టం అవుతోంది.

ఈ కారణంగానే హుజురాబాద్ పట్టణానికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గ బార్డర్‌కు కేవలం కిలోమీటరు దూరంలోనే పెంచికల్‌పేట ఉండడంతో జన సమీకరణ కోసం వెచ్చించే ఖర్చు కూడా తగ్గుతుండటం లాభిస్తుందని అంచనా వేశారని తెలుస్తోంది.


Next Story

Most Viewed