చైనా, పాక్‌కు గట్టిగా బుద్ది చెప్పాల్సిందే..

by  |
చైనా, పాక్‌కు గట్టిగా బుద్ది చెప్పాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్ : మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా, పాకిస్థాన్‌ లకు గట్టి బుద్ధి చెప్పాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ అన్నారు. సరిహద్దు శత్రువులతో పోరాడేందుకు పంజాబ్ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుందని ఆయన వివరించారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న దృష్ట్యా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పంజాబ్ రాష్ట్రంలో పాకిస్థాన్ ప్రతిరోజూ కాల్పులకు తెగబడుతోందని, మరోవైపు డ్రాగన్ స్నేహహస్తం అందిస్తూనే మన దేశానికి కొరకరాని కొయ్యగా మారిందని గుర్తుచేశారు. ఇటీవల గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా పాశవిక దాడులకు పాల్పడిందని, అయితే వాటిని మన బలగాలు సమర్ధవంతగా తిప్పికొట్టాయని చెప్పారు. దాయాది పాక్ కు భారత్ ప్రతిసారీ గట్టిగా బుద్ది చెబుతున్న దాని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదన్నారు. పాక్ వైఖరినే చైనా మీద చూపించాల్సిన సమయం ఆసన్నమైనదని కప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు.

ఇవాళ భారత్ 74వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షలాది మంది భారతీయులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏ పోరాటంలో అయినా పంజాబీలు ముందే ఉన్నారని.. పంజాబ్ అమరవీరులను, వారి త్యాగాలను గుర్తుచేసుకోవడం మంచి పరిణామమన్నారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న రక్షణ బలగాలకు సెల్యూట్ చేయాల్సిన సమయం ఇదని సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed