- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఉత్సవాలు కాదు.. కర్మకాండలు చేయండి -అనురాధ
దిశ, ఏపీ బ్యూరో: జగన్పాదయాత్రకు మూడేళ్లంట. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు కాదు.. కర్మకాండలు చేయండని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అనురాధ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ పాలనలో సంక్షేమం చచ్చిపోయిందన్నారు.
ఓ చేత్తో డబ్బులిచ్చి మరో చేత్తో లాక్కోవడమే వైసీపీ విధానమని దుయ్యబట్టారు. జగన్ తొలి అడుగుతో రాప్ట్రంలో వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి కావడం వల్ల రాష్ట్రం ముఫ్ఫై ఏళ్లు వెనక్కు వెళ్లిందని విమర్శించారు. రైతన్నకు అండగా రైతు భరోసా లేదన్నారు. మీటర్ల పేరుతో రైతు మెడకు ఉరితాడు బిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నరలోనే రూ. 50 వేల కోట్లకు పైగా ప్రజలపై పన్నుల భారం మోపారని అనురాధ ధ్వజమెత్తారు.
కులం ప్రామాణికం కాదంటూనే ఒకే సామాజిక వర్గానికి 870 పోస్టులు ఎలా ఇచ్చారని నిలదీశారు. విద్య, వైద్యం అందరికీ అందించడమే మీ లక్ష్యమైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత మందికి ప్రయోజనం చేకూరిందో చెప్పాలని ప్రశ్నించారు. అసహాయుల కన్నీళ్లు తుడిచామని గొప్పగా చెప్పుకుంటే సరిపోదన్నారు. కన్నీళ్లు తుడవడమంటే దళితులకు శిరోముండనం చేయడమేనా అంటూ నిలదీశారు. 17 నెలల్లో 600 కు పైగా అత్యాచారాలు చోటుచేసుకుంటే చట్టమే కాని దిశ వల్ల ఎవరికి ప్రయోజనం కలిగిందని అనురాధ ప్రశ్నించారు.