ఆటగాళ్లకే కాదు.. వాళ్లకూ వీసాలు కావాలి : పీసీబీ

by  |
ఆటగాళ్లకే కాదు.. వాళ్లకూ వీసాలు కావాలి : పీసీబీ
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ ఆటగాళ్లతో పాటు అభిమానులు, జర్నలిస్టులకు కూడా టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి ఇండియా వీసాలు మంజూరు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహసాన్ మణి అన్నారు. ఈ విషయంపై మార్చి నెలాఖరు లోగా బీసీసీఐ తమ నిర్ణయం చెప్పాలని హెచ్చరించారు. ఐసీసీలో పెద్దన్నలుగా ఉన్న మూడు క్రికెట్ బోర్డులు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలు ఇస్తామని లిఖిత పూర్వక హామీనే కాకుండా, అభిమానులు, జర్నలిస్టులకు కూడా వీసాలు మంజూరు చేయకపోతే వేదికను యూఏఈ మార్చాలని ఐసీసీకి లేఖ రాస్తామని ఎహసాన్ మణి చెబుతున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా ఇండియా-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఇండియాలో టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. దీనికి సంబంధించిన వీసాలను మార్చిలోగా మంజూరు చేయాలని పీసీబీ కోరుతున్నది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని బీసీసీఐ స్పష్టం చేసింది.


Next Story