త్వరలోనే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు

by  |
త్వరలోనే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైల్వేశాఖ త్వరలోనే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైల్ నడపడానికి సంసిద్దమవుతోందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ తెలిపారు. రైల్వే బోర్డు అధికారులు, రాష్ట్ర రవాణాశాఖ అధికారుల సమావేశాన్ని ఆదివారం దక్షిణ మధ్య రైల్వే నిలయంలో నిర్వహించారు. ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన సమస్యలు అనే అంశంపై కమిషనర్లు, పరిశ్రమ ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) , ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయడానికి రైల్వేశాఖ పూర్తిగా సిద్ధమవుతోందన్నారు.

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగవంతమైన కదలికకు గ్రీన్ కారిడార్ సృష్టించబడుతోందని వెల్లడించారు. సాంకేతిక ప్రయత్నాలు పూర్తయిన తరువాత ఖాళీ ట్యాంకర్లను రైల్వేలోని కలంబోలి లేక బోయిసర్ నుంచి ముంబైకి తరలిస్తామని, ఆక్సిజన్ నింపేందుకు వైజాగ్, జంషెడ్ పూర్, రూర్కెలా, బొకారోలకు తరలిస్తామని తెలిపారు. కొవిడ్ చికిత్సలో ఆక్సిన్ కీలకమని, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంఓ) ట్యాంకర్లను రైల్వే ద్వారా తరలించాలని మధ్యప్రదేశ్, మహారాష్ర్ట ప్రభుత్వాలు రైల్వే మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపాయని తెలిపారు.

ఎల్ఎంఓ రవాణాకు సాంకేతిక సాధ్యాసాధ్యాలను అన్వేషించి వ్యాగన్ల పై ఉంచిన రోడ్ ట్యాంకర్లతో రోల్ఆన్ రోల్ ఆఫ్ ద్వారా సరఫరా చేయడుతుందని వెల్లడించారు. తాత్కాలికంగా 10 ట్యాంకర్లను ఈనెల 19న పంపించడానికి ప్రణాళికల రూపొందించి మహారాష్ర్టకు వ్యాగన్లలో అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వాల డిమాండ్లకు సంబంధించి జోనల్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చామని, దీంతో రైల్వే బోర్డు సంబంధిత జీఎంలను ఆదేశించిందని తెలిపారు. నోడల్ ఆఫీసర్ నామినేటెడ్ మేరకు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయడం జరుగుతుందని వెల్లడించారు.

Next Story

Most Viewed