చివరి క్షణంలో ఏమైనా జరగొచ్చు

by  |
చివరి క్షణంలో ఏమైనా జరగొచ్చు
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ చివరి క్షణాల్లో రద్దైనా అవ్వొచ్చని స్కై స్పోర్ట్స్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. టోక్యోలో కరోనా కేసులు పెరగడంతో పాటు ఒలింపిక్ విలేజ్‌లో కూడా కేసులు నమోదు అవుతుండటంతో చివరి క్షణాల్లో మెగా క్రీడలు రద్దు చేసేందుకు నిర్వాహక కమిటీ సిద్దపడుతున్నదని ఆ కథనంలో పేర్కొన్నారు. గత 24 గంటల్లో ఒలింపిక్స్‌కు సంబంధించిన 67 మందికి కరోనా సోకింది. చెక్ రిపబ్లిక్ బీచ్ వాలీబాల్ కోచ్ సైమన్, కొంత మంది ఒలింపిక్ వాలంటీర్లు కరోనా బారిన పడ్డారు.

సౌతాఫ్రికి సాకర్ టీమ్ కూడా కరోనా సోకి ఐసోలేషన్‌కు వెళ్లారు. మెక్సికో బేస్ బాల్ జట్టులో కూడా ఇద్దరికి కరోనా సోకినట్లు తేలింది. ఇలా వరుసగా కేసులు పెరుగుతుండటంతో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ ఆందోళన చెందుతుంది. అతిపెద్ద కంటైన్‌మెంట్ జోన్‌గా మారకముందే రద్దు చేస్తే మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ వార్తా కథనం వెలువడిన దగ్గర నుంచి క్రీడాకారులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.



Next Story

Most Viewed