లాక్‌డౌన్ లోనూ ఆన్‌లైన్ ఆర్డర్లు

by  |
లాక్‌డౌన్ లోనూ ఆన్‌లైన్ ఆర్డర్లు
X

దేశంలో రాబోయే 21 రోజుల వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు ఎవరూ తమ ఇంటి గడప దాటేందుకు వీల్లేదని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దుకాణాలకు వెళ్లి వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ లోనూ ఇదే పరిస్థతి నెలకొంటుంది. ఇలాంటి నిర్ణయమే ఇటలీ లాంటి దేశాలు తీసుకున్నప్పడు అక్కడి ప్రజలంతా ఆన్ లైన్ సైట్ల ద్వారానే ఆహర పదార్థాలు, నిత్యవసరాలు, మందులు అన్ని కొనుగోలు చేశారు. కానీ ఇక్కడ లాక్ డౌన్ విధించగా అన్ని రకాల ఈ-కామర్స్ సైట్లు సైతం హోం డెలివరీలను ఆపేశాయి. ఫలితంగా ప్రజలు తమకు కావాల్సిన సరుకుల కోసం నేరుగా దుకాణాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.
ఈ వ్యవహారంపై స్పందించిన ఓ నెటిజన్ ఓ ప్రశ్నను సంధిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్ లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నిత్యవసరాలను ఇంటికి చేరవేయడంలో పేరిన్నిక గన్న ప్రముఖ హోండెలివరీ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చేయాలని ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ను ఆదేశించిన ట్టు తెలిపారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని , ఒకట్రెండు రోజుల్లో ఆన్ లైన్ లోనే నిత్యవసరాలు కొనుక్కునే అవకాశం రావొచ్చని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: Online orders act Lockdown as well, Minister KTR tweet, A question of netizen



Next Story