ముసలోడే గానీ.. మామూలోడు కాదు.. డిగ్రీలపైనే దండయాత్రలు..

by  |
ముసలోడే గానీ.. మామూలోడు కాదు.. డిగ్రీలపైనే దండయాత్రలు..
X

దిశ, వెబ్ డెస్క్: చదువు పై కొందరికి మక్కువ ఎంత వయసు పెరిగినా పోదు. తమిళనాడు రాష్ట్రంలోని మైలా డుదరై జిల్లా, కదిరిమంగళం గ్రామానికి చెందిన గురుమూర్తి సుమారు 24 డిగ్రీలు చదివాడు. తన 25 వ ఏట డిగ్రీ పై యుద్దం ప్రకటించాడు. ఇప్పటి వరకూ గజినీ, ఘోరీ మహమ్మద్ లు లాగా దండ యాత్రలు చేస్తూనే ఉన్నాడు. 82 ఏళ్ల వయసు వచ్చినా నిత్య విద్యార్థి లా చదువుతూనే ఉన్నాడు. గతంలో పాటిటెక్నిక్ లెక్చరర్ గా పనిచేశాడు. ఎంఏ, బీఏ, పీహెచ్ డీ, ఎంఫిల్.. ఇలా 24 డిగ్రీలు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ తాత. రిటైర్మెంట్ కావడానికంటే ముందు కేవలం 12 డిగ్రీలతోనే సరిపెట్టుకున్నాడట.

అయితే పదవీ విరమణ తర్వాత ఆగకుండా ఏకధాటిగా మరో 12 డిగ్రీలు పూర్తి చేసి వారెవ్వా అనిపించుకుంటున్నాడు. వయసు మీద పడింది ఇంకేమి చదువుతావు అని అంటున్నా పట్టించుకోవడం లేదట. వారి నోర్లు మూయించడానికే శనివారం ఎంఏ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుకి అప్లై చేసుకున్నాడు. ఈయన చదువు గురించి తెలిసిన నెటిజన్లు ‘ముసలోడే కానీ.. మామూలోడు కాడు..’ అంటూ ఫన్నీ కామెంట్లు చేసుకుంటున్నారు.



Next Story

Most Viewed