ఏడాది మారినా.. తేదీలు మారని ఒలింపిక్స్ !

by  |
ఏడాది మారినా.. తేదీలు మారని ఒలింపిక్స్ !
X

కరోనా వైరస్ ప్రపంచమంతటా విలయతాండవం చేస్తుండటంతో.. నాలుగేండ్లకోసారి నిర్వహించే ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐవోసీ ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ 2020ని వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేశారు. కాగా, ఏడాది మారినా ఒలింపిక్స్ తేదీల్లో పెద్దగా మార్పు ఉండబోదని జపాన్ మీడియా వెల్లడించింది. 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు విశ్వక్రీడలు జరుగుతాయిని క్రీడల అధికారిక బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే స్పష్టం చేసింది. ఈ ఏడాది నిర్ణయించిన షెడ్యూల్‌తో పోలిస్తే తేదీల్లో పెద్దగా మార్పు ఉండబోదని టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యషిరో మోరీ చెప్పారు.

సమ్మర్ ఒలింపిక్స్‌ను జులై-సెప్టెంబర్ మధ్యనే నిర్వహించబోతున్నామని.. ప్రస్తుతం ఐవోసీతో స్పష్టమైన తేదీల కోసం చర్చలు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఐవోసీతో చర్చల అనంతరం తేదీలను వెల్లడిస్తామన్నారు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Tags : Olympics, postponed, 2021, IOC, Japan, Tokyo

Next Story