ఒలింపిక్స్‌లో వింత నిబంధనలు

by  |
ఒలింపిక్స్‌లో వింత నిబంధనలు
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ 2020 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అయితే ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఏ మాత్రం మీరినా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటారు. పురుష బాక్సర్లు ఏ విభాగంలో పోటీ పడుతున్నా క్లీన్ షేవ్ తప్పని సరిగా చేసుకోవాలి. మీసాలు తీయడానికి ఇష్టపడని వాళ్లుంటే వారి కోసం పెన్సిల్ కట్ మీసాలను మాత్రం అనుమతిస్తారు. ఇంకా ఇలాంటి నిబంధనలు చాలా ఉన్నాయి.

– జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనే మహిళా జిమ్నాస్ట్‌లు వేళ్లకు రంగు రంగుల నెయిల్ పాలిష్‌లు వేసుకోవడాన్ని పూర్తిగా నిషేధించారు. మేకప్ వేసుకోవడానికి అనుమతి ఉన్నా.. గోర్ల పెయింట్ మాత్రం నిషేధం.

– మైదానాలు, కోర్టులు, బౌట్‌లు, స్విమ్మింగ్ పూల్స్, క్రీడా గ్రామంలో ఆటగాళ్లు నిరసన తెలపడం నిషేధం. అన్యాయం జరిగిందంటూ, మార్కులు తక్కువ వేశారని ధర్నాలు చేయడానికి అనుమతించరు.

– వాటర్ పోలో గేమ్‌లో ఆట ప్రారంభానికి ముందు అందరి ఆటగాళ్ల వేళ్లు పరిశీలిస్తారు. చేతికి, కాళ్లకు గోర్లు పొడుగ్గా ఉంటే కత్తిరిస్తారు.

– రెజ్లర్లు తమతో పాటు తప్పని సరిగా కర్చీఫ్ ఉంచుకోవాలి. ఆటలో గాయపడి రక్తం కారితే దానితో తుడుచుకోవడానికి అనుమతి ఇస్తారు.

– స్విమ్మర్లు వరల్డ్ రికార్డు సాధిస్తే అది ఆటోమెటిక్‌గా నమోదు కాదు. ఆ పోటీ ఫలితాన్ని ఫ్యాక్స్ చేస్తేనే వరల్డ్ రికార్డు నమోదు చేస్తారు.

– ఆటగాళ్లు మైదానాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయకూడదు. గెలిచిన ఆనందంలో అలా చేయడాన్ని ఒప్పుకోరు.

– మైదానంలో కేవల పోటీ పడే ఆటగాళ్లు, వారి కోచ్‌లను మాత్రమే అనుమతిస్తారు.

– మగ ఫిగర్ స్కేటర్లు కేవలం ట్రౌజర్లు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. మహిళా స్కేటర్లు కేవలం స్కర్ట్‌లు మాత్రమే వేసుకోవాలి.

– బీచ్ వాలీబాల్ గేమ్‌లో తప్పనిసరిగా బికినీలు మాత్రమే ధరించాలి. ఆ బికినీ కూడా 7 సెంటీ మీటర్ల కంటే పెద్దగా ఉండకూడదు.

– బీచ్ వాలీబాల్ పోటీల్లో ఇరు జట్లు తమకు నచ్చిన రంగుల బికినీ, బ్రాలు ధరించ వచ్చు. అయితే ఇరు జట్లు ఒకే రంగు ఇష్టపడితే మాత్రం టాస్ వేసి రంగు నిర్ణయిస్తారు.

– ఈక్వెస్ట్రియన్ ఆటలో పోటీ ముగిసే వరకు ఆటగాడు నోరు తెరవకూడదు. కనీసం గుర్రాన్ని అదిలించవద్దు. అలా చేస్తే పోటీలో చివరి స్థానం ఇస్తారు.

– డైవర్లు ఈత కొలనులోకి డైవ్ చేసే ముందు ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. భయపడుతున్నట్లు కనిపిస్తే రెండున్నర పాయింట్ల కోత పెడతారు.



Next Story