టీఎస్ సర్కిల్‌లో 1150 గ్రామీణా డాక్ సడక్‌లు

by  |
టీఎస్ సర్కిల్‌లో 1150 గ్రామీణా డాక్ సడక్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తెలంగాణ సర్కిల్‌కు చెందిన చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం గ్రామీణ డాక్ సడక్ (జీడీఎస్) ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 1150
పోస్టు పేరు: గ్రామీణ డాక్ సడక్
– బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)
– అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)
– డాక్ సడక్
అర్హత: మ్యాథమెటిక్స్, లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో టెన్త్‌క్లాస్ ఉత్తీర్ణత. పదో తరగతి వరకు లోకల్ లాంగ్వేజ్ చదివి ఉండాలి. సంబంధిత గ్రామ పరిధిలో నివసిస్తూ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ ట్రెయినింగ్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. పదోతరగతిలో కంప్యూటర్ చదివితే సర్టిఫికెట్ అవసరం లేదు. సైకిల్ తొక్కడం లేదా స్కూటర్/మోటార్ సైకిల్ నడపగలగాలి.
వయస్సు: జనవరి 27, 2021 నాటికి 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ.100(ఎస్సీ/ ఎస్టీ, పీహెచ్‌సీ, అన్ని వర్గాల మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
పే స్కేల్: టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (టీఆర్‌సీఏ) ద్వారా చెల్లిస్తారు. బీపీఎంకు కనీసం 4గంటలకు టీఆర్‌సీఏ రూ.12,000, ఐదు గంటలకు టీఆర్‌సీఏ రూ.14,500 చెల్లిస్తారు.
ఎంపిక: టెన్త్ క్లాస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా. నిబంధనల ప్రకారం ఆటో‌మేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ తయారవుతుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: 26, ఫిబ్రవరి, 2021
వెబ్‌సైట్: http://appost.in/gdsonline.com లో పూర్తి వివరాలు పొందుపరిచారు.



Next Story