పోడు భూముల్లో పట్టాలివ్వండి.. కొత్తగూడలో గిరిజనేతరుల ఆందోళన

by  |
పోడు భూముల్లో పట్టాలివ్వండి.. కొత్తగూడలో గిరిజనేతరుల ఆందోళన
X

దిశ, కొత్తగూడ: ఏజెన్సీ మండలాల్లో గిరిజనేతర రైతులు తరతరాల నుంచి పోడు భూముల్లో సాగు చేసుకుంటున్నారని.. ఈ భూములను పరిశీలన చేసి ఎఫ్‌ఆర్‌సీ కమిటీలో అవకాశం కల్పించి, పట్టాలు ఇవ్వాలని మండల కేంద్రానికి చెందిన గిరిజనేతరులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు దేశిడి శ్రీనివాస్ రెడ్డి, చల్లా నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, బిట్ల శ్రీను, ఢిల్లీ మోహన్ రావు మాట్లాడుతూ.. ఏజెన్సీలో ఎన్నో సంవత్సరాలుగా ఆదివాసీలతో సహజీవనం చేస్తున్న గిరిజనేతరుల పోడు భూములకు హక్కులు కల్పించాలన్నారు. 1/70 చట్టం ప్రకారం 1970 కంటే ముందు ఉన్న గిరిజనేతరులకు పోడు భూములకు పట్టాలతో పాటు రైతు బీమా, రైతు బంధు వర్తింపజేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఫ్‌ఆర్‌సీ కమిటీలో గిరిజనేతరులకు 1/3 ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుంకరబోయిన మొగిలి, ఉల్లెంగుల రమేష్, నబీ, గజ్జి రామన్న, రాజం సారంగం, బట్టు రమేష్, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed