18 ప్లస్ యువతకు అందని వ్యాక్సిన్​

by  |
18 ప్లస్ యువతకు అందని వ్యాక్సిన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాక్సినేషన్​ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. 18ఏళ్లు పైబడిన వారందరూ నేరుగా టీకా సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్​ వేయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ నిబంధనలు రాష్ట్రంలో అమలు కావడం లేదు. 18 నుంచి 29 ఏళ్ల వారికి వ్యాక్సిన్​వేసేందుకు ప్రభుత్వం టీకా సెంటర్లలో సిబ్బంది నిరాకరిస్తున్నారు. తమకు ఆదేశాలున్నాయని 30ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేపడుతామని తేల్చి చెబుతున్నారు. దీంతో వ్యాక్సినేషన్​ కోసం వెళ్లిన 30లోపు వారందరూ నిరాశతో వెనుదిరుగుతున్నారు.

అల్వాల్ ​యువతికి అందని వ్యాక్సిన్​

హైదరాబాద్​ అల్వాల్ ప్రాంతంలో వ్యాక్సినేషన్​ కోసం వెళ్లిన 19 ఏళ్ల యువతికి వ్యాక్సిన్​ అందించేందుకు టీకా సెంటర్ల నిర్వహకులు నిరాకరించారు. ఆ ప్రాంతంలోని 3 ప్రభుత్వ టీకా సెంటర్లకు వెళ్లగా ఇదే తరహా పరిస్థితులు ఎదురయ్యాయి. వ్యాక్సిన్​ఎందుకు ఇవ్వరని ప్రశ్నించగా తము పై అధికారుల నుంచి ఆదేశాలున్నాయని వ్యాక్సిన్​ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. జూన్ 21 నుంచి 18ఏళ్లు నిండిన వారందరికి ఉచితంగా టీకాలు అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటనకు క్షేత్ర స్థాయిలో అమలుకు విరుద్దంగా ఉండటంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి.

బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,59,061 మందికి వ్యాక్సిన్​ పంపిణీ చేయగా వీరిలో మొదటి డోసు వ్యాక్సిన్‌ను 1,48,984 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్‌ను 10,077 మందికి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం మొదటి వ్యాక్సిన్‌ను 79,03,340 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్‌ను 1,58,0975 మందికి అందించారు.



Next Story

Most Viewed