జనవరి 31 వరకు విదేశీ విమానాలపై నిషేధం

by  |
flight
X

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరోమారు పొడగించింది. వచ్చే నెల 31 వరకు నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ట్విట్టర్ వేదికగా గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలతో పాటు ప్రత్యేక విమానాలకు నిషేధం వర్తించదని పేర్కొంది. కాగా గతంలో ఈ నెల 15నుంచి అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో పాటు కేసుల సంఖ్య ఆధారంగా పలు దేశాలపై నిషేధాన్ని కూడా తొలగిస్తామని తెలిపింది. అయితే, తాజాగా ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుండడంతో మరోసారి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ప్రమాదంలో ఉన్న దేశాల నుంచి వచ్చే వారు, ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి కోవిడ్ పరీక్షను తప్పనిసరి చేస్తూ ఢిల్లీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం విమానాశ్రయ అధికారులు 20 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. కాగా గతేడాది మార్చిలో కరోనా మొదటి వేవ్ రాకతో అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed