యూపీలో జూన్ 30వరకు.. : యోగి ఆదిత్యనాథ్

by  |
యూపీలో జూన్ 30వరకు.. : యోగి ఆదిత్యనాథ్
X

లక్నో: కరోనా నియంత్రణకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. యూపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జూన్ 30 వరకు ఆ రాష్ట్రంలో ఎలాంటి సామూహిక కార్యక్రమాలు జరపడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. కరోనా కట్టడిలో భాగంగా ఆదిత్య నాథ్ కఠిన నిబంధనలు విధించారని పేర్కొన్నారు. దీని ప్రకారం జూన్ 30వరకు ప్రజలెవ్వరూ గూమిగూడే కార్యక్రమాలు జరుపుకోవద్దని సూచించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని సమీక్షించే 11 కమిటీల చైర్ పర్సన్‌లతో యోగి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మే 3 తర్వాత కేంద్రం లాక్‌డౌన్ ఎత్తివేసినా, కొనసాగించినా రాష్ట్రంలో పై నిబంధనలు మాత్రం అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

Tags: UP, yogi adityanath, june 30, lockdown, corona, virus, no public gatherings

Next Story

Most Viewed