‘మీ సేవ’లకు రావాల్సిన అవసరం లేదు: లోకేశ్ కుమార్

by  |
‘మీ సేవ’లకు రావాల్సిన అవసరం లేదు: లోకేశ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అన్నారు. అర్హులను తామే గుర్తించి వరద సాయం అందిస్తామని చెప్పారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాయని తెలిపారు. వరద సాయం అందని వారి వివరాలు సేకరించి బాధితుల అకౌంట్లలోకి వరద సాయం జమ చేస్తామని పేర్కొన్నారు.

కాగా వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేలు వరద సాయం ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయింది. వరద సాయాన్ని డిసెంబర్ 7 నుంచి పున: ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు మీ సేవా కేంద్రాల వద్ద సోమవారం ఉదయం నుంచి బారులు తీరారు.



Next Story

Most Viewed