ఏసీలు ఫ్యాన్లు, టీవీలు ఆఫ్ చేయక్కర్లేదు

by  |
ఏసీలు ఫ్యాన్లు, టీవీలు ఆఫ్ చేయక్కర్లేదు
X

న్యూఢిల్లీ: ప్రధాని ఇచ్చిన పిలుపుతో ఒకేసారి లైట్లు ఆఫ్ చేస్తే వోల్టేజ్ లో మార్పులు(ఫ్లక్చువేషన్స్) వచ్చి ఎలక్ట్రికల్ పరికరాలు పాడయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వచ్చాయి. అయితే.. అటువంటి భయాలు ఏమీ అవసరం లేదని కేంద్రం తెలిపింది. ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్లు పటిష్టంగా ఉన్నాయని.. కావాల్సిన అరేంజ్మెంట్ చేశామని.. వోల్టేజ్ హెచ్చుతగ్గులను తట్టుకొనే శక్తి సామర్థ్యం ఉన్నదని పవర్ మినిస్ట్రీ వెల్లడించింది. అయినా ప్రధాని కేవలం లైట్లు మాత్రమే ఆఫ్ చేయమని చెప్పారని.. ఏసీలు, ఫ్యాన్లు, కంప్యూటర్లు, ఫ్రిడ్జిలు సహా ఇంట్లోని ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాలను బంద్ చేయాల్సిన అవసరం లేదని పవర్ మినిస్ట్రీ ప్రకటన పేర్కొంది. కేవలం నివాసాల్లోని లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలని.. మిగతావన్ని ఆన్ లోనే ఉంటాయని.. వీధి లైట్లు కూడా వెలుగుతుంటాయని తెలిపింది. హాస్పిటళ్లు, పోలీస్ స్టేషన్లు.. సహా అత్యవసర సేవలందించే కార్యాలయాలన్నింటిలో లైట్లు వెలుగుతూనే ఉంటాయని వివరించింది.

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న చీకటిని పారద్రోలేందుకు ప్రజలందరూ ఒక్కసారిగా ఆదివారం రాత్రి 9 గంటలకు తమ నివాసాల్లోని లైట్లను ఆఫ్ చేసి.. ద్వీపాలు, క్యాండిల్ లైట్లు, మొబైల్ ఫ్లాష్ లైట్లను 9 నిమిషాల పాటు వెలిగించాలని ప్రధాని కోరిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఆన్ చేయడం వోల్టేజ్ లో మార్పుల వల్ల ఇండ్లలోని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పాడయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే కేవలం నివాసంలోని లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలని మిగతావన్నీ ఆన్ లోనే ఉంచాలని పవర్ మినిస్ట్రీ స్పష్టత ఇచ్చింది.

Tags: Light, Candles, Off, on, ac, tv, fan


Next Story