బీపీసీఎల్‌ బిడ్‌ గడువు పొడిగింపు ఉండకపోవచ్చు!

by  |
బీపీసీఎల్‌ బిడ్‌ గడువు పొడిగింపు ఉండకపోవచ్చు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మరి కారణంగా వాయిదా పడుతూ వస్తున్న బీపీసీఎల్ ప్రైవేటీకరణ బిడ్ గడువు మరోసారి పొడిగించే అవకాశాల్లేవని పెట్టుబడుల విభాగం (దీపమ్‌) కార్యదర్శి సోమవారం స్పష్టం చేశారు. భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తపరిచే తేదీనీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు సార్లు పొడిగించింది. ప్రస్తుతం ఈ గడువు నవంబర్ 16 వరకు ఉంది. ‘వ్యూహాత్మక పెట్టుబడుల విషయంలో కొవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా పెట్టుబడిదారులు కీలక లావాదేవీలకు సంబంధించి మరింత సమయం అడిగారు.

అయితే, ప్రస్తుతం విధించిన నవంబర్ 16 గడువు పొడిగింపు మళ్లీ ఉండకపోవచ్చని నమ్ముతున్నాను’ అని ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే చెప్పారు. కాగా, గతేడాది నవంబర్‌లో బీపీసీఎల్‌లో ప్రభుత్వం తన 52.98 శాతం వాటాను విక్రయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆసక్తి వ్యక్తీకరణకు బిడ్ల కోసం ఈ ఏడాది మార్చిన గడువు ఇచ్చారు. అయితే, కరోనా పరిణామాల నేపథ్యంలో నాలుగుసార్లు వాయిదా పడిన ఈ ప్రక్రియ ఐదో సారి వాయిదా పడే అవకాశంలేదని తెలుస్తోంది.



Next Story

Most Viewed