‘కాంగ్రెస్ పార్టీని ఏశక్తి అడ్డుకోలేదు’

by  |
congress leader
X

దిశ, షాద్‌నగర్: కాంగ్రెస్ పార్టీ ఎంతో ఘన చరిత్ర కలిగిన పార్టీ అని కొన్ని ఒడిదుడుకులు ఎదురైనంతమాత్రాన తక్కువ అంచనా వేయవద్దని, టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రాకతో పార్టీ బలంగా మారిందని ఇక కాంగ్రెస్ పార్టీని ఏశక్తి అడ్డుకోలేదని షాద్ నగర్ కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో షాద్ నగర్ నియోజకవర్గం నుండి 80 కార్లు 100 ద్విచక్ర వాహనాలలో పెద్దఎత్తున కార్యకర్తలు,నాయకులు కందుకూరు ధర్నాకు తరలివెళ్లారు. అదేవిధంగా కందుకూరు వద్ద కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డితో కలిసి ఎడ్లబండిపై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ కు మధుయాష్కీ గౌడ్ ప్రసంగించే అవకాశం ఇచ్చారు. వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర లీటర్ కు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 రూపాయలు ఉందన్నారు. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర 71రూపాయలు ఉంటే ఇప్పుడు అది 105 రూపాయలకు చేరిందని విమర్శించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై టీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని, ప్రజలు కష్టాలు ప్రభుత్వాలకి పట్టవా అని నిలదీశారు. టీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ బాబర్ ఖాన్, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం,నాయకులు బాల్ రాజుగౌడ్, జగదీష్, చల్లా శ్రీకాంత్ రెడ్డి, నందిగామ రామ్ రెడ్డి, ఆశన్న గౌడ్, కృష్ణారెడ్డి, రాజు, జంగా నరసింహ, గూడ వీరేశం, హరినాథ్ రెడ్డి, సీతారాములు, అశోక్, గిరి యాదవ్, రాయికల్ శ్రీనివాస్, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమార స్వామి గౌడ్, రాజగోపాల్ రెడ్డి, మల్లేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందే మోహన్,ముబారక్,ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed