‘అసెంబ్లీకి సిబ్బందిని తీసుకురావొద్దు’

by  |
‘అసెంబ్లీకి సిబ్బందిని తీసుకురావొద్దు’
X

దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిబ్బందని తీసుకురావద్దని ఏపీ శాసన సభ కార్యదర్శి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ బులెటిన్‌ను విడుదల చేశారు.

కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి ఉంటుదనీ, శాసన సభ సభ్యులు తమ కార్లకు కారు పాస్‌‌లను తప్పనిసరిగా అంటించాలని సూచించారు. గుర్తు తెలియనివారికి అసెంబ్లీలోకి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే, గన్‌మేన్లను కూడా అనుమతించకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు.

బ్యానర్లు, ఫ్లకార్డ్స్, కర్రలు, స్ప్రేలు వంటివేవీ శాసన సభలోకి అనుమతించలేమనీ, అసెంబ్లీ ఆవరణంలో ఎలాంటి ఆందోళనలు చేయకూడదని ఆదేశించారు. కాగా, ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Next Story