అప్పుడు హాస్పిటల్స్.. ఇప్పుడు హోటల్స్‌.. బెడ్ల కొరత తీరేదెలా..?

by  |
manali
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్-19 సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్నాయి. జనాలు మళ్లీ తమ రెగ్యులర్ లైఫ్‌స్టైల్‌ ఫాలో అవుతున్నారు. క్రమంగా టూరిస్టు ప్రదేశాలన్నీ ఓపెన్ చేయడంతో హిల్ స్టేట్స్‌లోని షిమ్లా, కుఫ్రీ, నర్కొండ, డల్హౌసీ, మనాలీ, లాహాల్’ తదితర పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. కొన్ని రోజుల కిందటి వరకు కొవిడ్ పేషెంట్లకు హాస్పిటళ్లలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క గందరగోళ పరిస్థితులు నెలకొనగా.. ఇప్పుడు టూరిస్టుల తాకిడితో ఆయా రాష్ట్రాలు హోటళ్లలో బెడ్లు దొరకని స్థితికి చేరుకున్నాయి.

ఇటీవలే మనాలీలోని వీధులన్నీ జనంతో నిండిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రజెంట్ సిచ్యువేషన్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జనాల బాధ్యతలేని ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ యూజరు ఒకరు.. ‘#మనాలీ ట్రెండ్స్, హాటళ్లలో బెడ్లు దొరకడం లేదు. మళ్లీ త్వరలోనే హాస్పిటళ్లలో బెడ్లు అందుబాటులో లేవని వినాల్సి వస్తుందా? గత అనుభవాల నుంచి ఏ పాఠం నేర్చుకోలేదా? #కొవిడ్-19 #థర్డ్ వేవ్ తప్పేలా లేదు’ అని ట్వీట్ చేశాడు. ఇక మరొక నెటిజన్.. ‘సెకండ్ వేవ్‌లో బాధితులకు ఆక్సిజన్, బెడ్లు, రెమిడెసివర్’ అందించేందుకు నిద్రలేని రాత్రులు గడిపా. అయినా మనం ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోతే అదంతా నిష్ర్పయోజనమే’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

https://twitter.com/Tushar_9096/status/1411969785563291650?s=20

ఇదేవిధంగా చాలా మంది నెటిజన్లు టూరిస్టు ప్లేసుల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల పట్ల మీమ్స్, ట్రోల్స్ క్రియేట్ చేస్తున్నారు. ‘బయటకు వెళ్లకుండా ఎక్కువ రోజులు ఇంట్లోనే గడపడం కష్టమని తెలుసు, కానీ మహమ్మారి ముప్పును దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా వ్యవహరించండి’ అని పోస్టలు పెడుతున్నారు. ‘పీస్‌ కోసం వెళ్తే రెస్ట్ ఇన్ పీస్’ కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. సిచ్యువేషన్ చూస్తుంటే థర్డ్ వేవ్ గ్యారంటీ అని ఇమాజిన్ చేస్తున్నారు.

Next Story

Most Viewed