జేడీయూ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకున్న నితీశ్

by  |
జేడీయూ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకున్న నితీశ్
X

పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ జేడీయూ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ ఆర్‌సీపీ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆర్‌సీపీ సింగ్ ఇప్పటి వరకు జేడీయూ కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నారు. 2010లో తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి సింగ్ జేడీయూ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

ఒకే వ్యక్తి రెండు బాధ్యతలు చేపట్టడం సరికాదని , తాను పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర సీఎంగా రెండు బాధ్యతలు చేపట్టాలనుకోవడం లేదని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పేర్కొని నితీశ్ కుమార్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అనంతరం జేడీయూ అధ్యక్షుడిగా ఆర్‌సీపీ సింగ్ పేరును నితీశ్ కుమార్ ప్రతిపాదించగా పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆర్‌సీపీ సింగ్ మూడేళ్లపాటు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. 2019లో అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న నితీశ్ కుమార్.. ఒకరికి ఒకే పోస్టు అనే విధానాన్ని పేర్కొంటూ ముందస్తుగానే తప్పుకున్నారు.



Next Story