ట్రాషన్.. వేస్ట్ ప్లాస్టిక్ నుంచి బెస్ట్ ఫ్యాషన్ వేర్

by  |
fashion from waste
X

దిశ, ఫీచర్స్ : ‘సింగిల్ యూజ్’ ప్లాస్టిక్ నీటి ప్రవాహాలకు అడ్డుగా మారుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశం ఈ తరహా సమస్యను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే పర్యావరణవేత్తలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు పేరుకున్న ప్లాస్టిక్ చెత్తను క్లీన్ చేసే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కాగా నైజీరియాకు చెందిన ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్ ఎసోహె ఓజిగ్బో మాత్రం ప్లాస్టిక్ వేస్ట్ నుంచి ఫ్యాషన్ దుస్తులు రూపొందించి అభినందనలు అందుకుంటోంది.

ఆఫ్రికా వాణిజ్య రాజధాని లాగోస్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోయి నదులు, సముద్రాలు, నీటి ప్రవాహాలకు అడ్డుకట్టగా మారుతున్నాయి. ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే సమస్య మరింత పెద్దదిగా మారి, భావి తరాలతో పాటు ఈ తరం కూడా తీవ్రమైన పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటుందని భావించిన ఓజిగ్బో ఏదో ఒకటి చేయాలనుకుంది. ఈ మేరకు తమ బృందంతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటితో ఫ్యాషన్ దుస్తులను రూపొందించారు. అంతేకాదు లాగోస్‌లోని వ్యర్థాల వ్యాప్తి గురించి తమ సందేశాన్ని మరింత బలంగా వినిపించేందుకు తన టీమ్‌తో కలిసి ‘ట్రాషన్ షో’లో పాల్గొన్నారు ఓజిగ్బో. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే సమస్యలపై ప్రజల్లో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. నగరంలోని సాంగోటో జిల్లాలో వరదల నివారణకు నిర్మించిన జలమార్గంలో ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా నీరు ప్రవహించడం లేదని, అందులో నీటి ప్రవాహం యథావిధిగా కొనసాగడమే తమ లక్ష్యమని ఓజిగ్బో తెలిపింది.

ఇక స్వీడన్ టీనేజర్, క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బెర్గ్‌ను తన ప్రేరణగా పేర్కొన్న ఓజిగ్బో.. ఈ ప్రదర్శన ప్రజల్లో వారి చర్యల గురించి కొంతైన ఆలోచించేలా చేస్తుందని ఆశిస్తున్నట్లుగా తెలిపింది. ‘మేమంతా టీనేజర్స్ కానీ ప్రపంచంలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’ అని వెల్లడించింది.


Next Story

Most Viewed