‘కేసులను దాచిన డ్రాగెన్ కంట్రీ’

by  |
‘కేసులను దాచిన డ్రాగెన్ కంట్రీ’
X

వాషింగ్టన్: కరోనా పుట్టినిళ్లు వూహాన్ నగరానికే వైరస్‌ను కట్టడి చేశామని.. అందుకే అతి తక్కువ కేసులు నమోదయ్యాయని చైనా ఇన్నాళ్లూ ప్రపంచానికి చెబుతూ వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 82,954 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,634 మరణాలు సంభవించాయి. కానీ అమెరికా సహా పలు దేశాలు చైనా చెబుతున్న ఈ లెక్కలను నమ్మడం లేదు. కరోనా కేసులు, మరణాలను చైనా తక్కువ చేసి చూపించిందని.. కానీ చాలా ఎక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు సంభవించి ఉంటాయని అమెరికా వాదిస్తోంది. కానీ ప్రపంచ దేశాల వాదనను చైనా ఎప్పటికప్పుడు ఖండించింది. అయితే తాజాగా చైనాకు చెందిన రక్షణ సాంకేతిక జాతీయ విశ్వవిద్యాలయం కరోనా ప్రభావంపై తయారు చేసిన నివేదిక ఒకటి లీక్ అయ్యింది. అందులో చైనాలో పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రిపోర్ట్ సంచలనంగా మారింది. వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న ‘ఫారిన్ పాలసీ మ్యాగజైన్ అండ్ హండ్రెడ్ రిపోర్టర్స్’ ఈ నివేదికను బయటపెట్టింది. చైనా అధికారికంగా చెబుతున్న గణాంకాల కంటే 8 రెట్లు ఎక్కువగా కేసులు నమోదైనట్లు పేర్కొంది. 6.40 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు, దానికి తగ్గట్లే మరణాలు సంభవించాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్ తదితర 230 ప్రదేశాల్లో నమోదైన రికార్డుల ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు సదరు విద్యాసంస్థ తెలిపింది. చైనాలోని ఛాంఘ్సా నగరంలో ఉన్న ఈ యూనివర్సిటీ కరోనా మొదలైన సమయం నుంచి గణాంకాలను అందిస్తోంది. ఆ యూనివర్సిటీ ఆన్‌లైన్‌లో చెబుతున్న గణాంకాలు, ప్రస్తుతం నివేదికలో వెల్లడించిన గణాంకాలకు సరిపోలుతున్నాయి. చైనా 82 వేల కేసులు మాత్రమే అని అధికారికంగా చెప్పడం శుద్ద అబద్ధమని తేటతెల్లమవుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీదీ గణాంకాలను తారుమారు చేయడంలో అందవేసిన చేయని పలు దేశాలు విమర్శిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఆరోపణలకు ఈ నివేదిక బలం చేకూర్చినట్లైంది. కాగా, చైనా మాత్రం ఇంత వరకు ఈ నివేదికపై స్పందించలేదు.

Next Story

Most Viewed