ధోనీ ఉంటే కోచ్ లేని లోటు తీరుతుంది: కుల్దీప్

by  |
ధోనీ ఉంటే కోచ్ లేని లోటు తీరుతుంది: కుల్దీప్
X

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనకు ధోనీపై ఎంత ఇష్టం, నమ్మకం ఉందో మరోసారి తెలియజేశాడు. మ్యాచ్ జరిగే సమయంలో కోచ్ లేని లోటును ధోనీ తీర్చేవాడని, తనకు, చాహల్‌కు ఎన్నోసార్లు విలువైన సలహాలిచ్చాడని చెప్పాడు. ఇప్పుడు ధోనీని తాను చాలా మిస్ అవుతున్నానని ఈ చైనామన్ బౌలర్ అన్నాడు. ‘ఆన్‌ఫీల్డ్‌లో మనకు సలహాలు ఇవ్వడానికి కోచ్ ఉండరు. ఎప్పుడైనా క్లిష్టమైన సమయంలో ధోనీ ఎదురుగా ఉంటే కోచ్ ఉన్నంత భరోసా ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో ధోనీ ఆటగాళ్లకు ప్రతి విషయంలోనూ సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. ఎక్కువగా బంతిని స్పిన్ చేయడంపైనా దృష్టిపెట్టాలని నాతో చెప్పేవాడు. మహీ వికెట్ల వెనుక ఉంటే ఒత్తిడి మొత్తం పోతుంది’ అని ప్రశంసలు కురిపించాడు. చాలా సమయాల్లో ధోనీనే ఫీల్డ్ సెట్ చేసి బంతి ఎలా వేయాలో కూడా చెప్పేవాడని కుల్దీప్ చెప్పాడు. ఇప్పటి కెప్టెన్ కొహ్లీ కూడా అలాగే సూచనలు ఇస్తున్నాడు. కానీ మహీ భాయ్ ఉంటే బాగుండనిపిస్తోందని కుల్దీప్ అన్నాడు. కుల్‌దీప్‌ భారత్ తరపున 6 టెస్టులు, 60 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 167 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్దపడుతున్నాడు.

Next Story

Most Viewed