‘క్రాక్’ రికార్డ్ ఓకే.. మరి కాపీ సంగతేంటి థమన్?

by  |
‘క్రాక్’ రికార్డ్ ఓకే.. మరి కాపీ సంగతేంటి థమన్?
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి డిసెంబర్ 14న రిలీజైన సెకండ్ సింగిల్ ‘భల్లేగా తగిలావే బంగారం’ పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అనిరుధ్ రవిచంద్రన్ పాడిన ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకోగా మూవీ యూనిట్ సెలబ్రేట్ చేసుకుంటోంది. అయితే వినేందుకు, స్టెప్స్ వేసేందుకు సాంగ్ సూపర్ క్యాచీగా ఉన్నా సరే.. ఇది థమన్ ట్యూన్ కాదని, మరోసారి కాపీ కొట్టేశాడని అంటున్నారు నెటిజన్లు.

గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ‘క్రాక్’ కోసం లాటిన్ అనే సినిమా ట్యూన్‌ను థమన్ కొట్టేశాడని చెప్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సాంగ్స్ నుంచి ట్యూన్ కాపీ చేయడం కామన్.. కానీ ఇంగ్లీష్ సాంగ్స్ నుంచి కాపీ చేసేవాడికే ఓ రేంజ్ ఉంటుందంటూ సాహో డైలాగ్‌ను వాడుతూ మీమ్స్ వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘భూం బద్దల్’ కూడా కాపీనే అంటున్నారు. ‘ప్రశ్నిస్తా’ అనే సినిమా నుంచి ‘ఏం పర్లేదు సాంగ్’ ట్యూన్‌ను యాజ్ ఇట్ ఈజ్‌గా కొట్టేశాడని అంటున్నారు నెటిజన్లు. ఏం చేద్దాం కొన్ని ట్యూన్స్ అంతే థమన్ సృష్టించినట్లుగా ఉంటున్నాయి.. అందులో అతని తప్పేమీ లేదని కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed