నెస్లే ఇండియా నికరలాభం రూ.487కోట్లు

by  |
నెస్లే ఇండియా నికరలాభం రూ.487కోట్లు
X

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో నికర లాభం 11.14శాతం వృద్ధి చెంది, రూ.486.6కోట్లు ఆర్జించినట్లు నెస్లే ఇండియా ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.437.79కోట్లుగా ఉంది. ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఆదాయం 2శాతం పెరిగి ఈ ఏడాదికి రూ.3,041.45కోట్లుగా ఉందని తెలిపింది. ‘మొత్తం అమ్మకాలు 2శాతం పెరిగాయి. దేశీయ అమ్మకాలు 2.6శాతం వృద్ధి చెందగా, అమ్మకాల ఎగుమతులు 9.3శాతం పడిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కోసం లాక్‌డౌన్ ప్రకటించడంతో కార్యాగారాల్లో ఉత్పత్తికి ఆటంకాలు తలెత్తాయి. ఈ కారణంగా తొలి త్రైమాసికంలో అమ్మకాలు పడిపోయాయి. విదేశాల నుంచి డిమాండు బాగా తగ్గిపోయింది’ అని సెస్లే ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. మొదటి, ప్రస్తుత త్రైమాసికంలో కార్యాగారాలు 75శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, కొవిడ్-19 నేపథ్యంలో కంపెనీ రూ.28.6కోట్ల ఇంక్రిమెంటల్ ఖర్చులను భరించిందని తెలిపింది. నెస్లే ఇండియా మనదేశంలో మ్యాగీ, డెయిరీ, కాఫీ ఉత్పత్తులను విక్రయిస్తున్న విషయం విదితమే.



Next Story

Most Viewed