ఒమిక్రాన్​ కేసులపై అధికారుల నిర్లక్ష్యం.. లైట్ తీసుకుంటున్న సర్కార్

by  |
Omicron
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నాన్​రిస్క్​దేశాల కరోనా పాజిటీవ్‌లను లైట్​ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎయిర్​పోర్టులో ఇచ్చిన శాంపిల్స్‌లో వ్యాధి నిర్ధారణ తర్వాత కొందరి వ్యక్తులకు సమాచారం వెళ్లడం లేదని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ఎయిర్​పోర్టు అధికారులు నెగెటివా? పాజిటివా? అనేది చెప్పకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో చాలా మంది వైరస్​సోకలేదనే భ్రమతో బహిరంగ ప్రదేశాల్లో తిరిగేస్తున్నారు. పైగా ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో కొవిడ్​లేదని క్వారంటైన్​కాకుండానే పనులు చేసుకుంటున్నారు. తీరా ర్యాండమ్ శాంపిల్స్‌లో ఒమిక్రాన్​నిర్ధారణ కావడంతో ఆఘమేఘాల మీద బాధితులను గుర్తించేందుకు అధికారులు కష్ట పడుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతున్నది? ఎయిర్​పోర్టు, వైద్యశాఖ మధ్య సమన్వయం లేదా? లేక అలసత్వమే కారణమా? అంటూ పబ్లిక్​ చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఒమిక్రాన్​వ్యాప్తికి దారి తీస్తుందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆ కేసుల్లో స్పష్టంగా లోపం..

బుధవారం తేలిన ఇద్దరి ఒమిక్రాన్​బాధితులను వేగంగా గుర్తించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, అసలు విషయాన్ని మరిచిపోతున్నది. కెన్యా మహిళ, సోమాలియా నుంచి వచ్చిన యువకుడు, అతని తండ్రి ఈ నెల 12వ తేదిన హైదరాబాద్‌కు వచ్చారు. అదే రోజు ఆర్టీపీసీఆర్‌కు శాంపిల్​ఇచ్చారు. నాన్ రిస్క్ కంట్రీ కావడంతో ఫలితాలు వచ్చే వరకు వేచి చూడకుండా వాళ్లు సిటీలోకి ప్రవేశించారు. చివరికి వారి ఫలితాల్లో కరోనా పాజిటివ్​ వచ్చింది. అయితే ఆ విషయాన్ని వారికి చెప్పారా? లేదా? అనేది అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. తెలిసినా వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేదీ వెల్లడించడం లేదు. దీంతో పాజిటీవ్​వచ్చినప్పుడే బాధితులను పట్టుకుని క్వారంటైన్​ చేసి ఉంటే, రెండు రోజుల పాటు సోమాలియా యువకుడు ఆసుపత్రులు తిరిగే వాడు కాదంటున్నారు. తద్వారా వైరస్​వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉండదని పలువులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ప్రజలు మండిపడుతున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఒమిక్రాన్​ఎట్ రిస్క్​దేశాల నుంచి వచ్చినోళ్లకు ఎయిర్​పోర్టులో స్క్రీనింగ్​నిర్వహించి ఆర్టీపీసీఆర్​టెస్టులు చేస్తారు. రిపోర్టులు వచ్చే వరకు అక్కడే వేచిచూడాలి. పాజిటివ్ తేలితే వెంటనే సదరు బాధితులను టిమ్స్‌కు తరలించి జీనోమ్ సీక్వెన్సింగ్​టెస్టుకు శాంపిల్ పంపిస్తారు. దానిలో నెగెటీవ్ వస్తేనే హోం ఐసోలేషన్‌కు అనుమతి ఇస్తారు. ఆ సౌకర్యం లేని వారు టిమ్స్‌లోనే చికిత్స పొందవచ్చు. కానీ నాన్​రిస్క్ కంట్రీస్​నుంచి వచ్చినోళ్లకు ఈ మార్గదర్శకాలు వర్తించవు. ఎయిర్​పోర్టులో దిగిన తర్వాత శాంపిల్​ఇచ్చేసి వెళ్లిపోవచ్చు. ఆర్టీపీసీఆర్ రిపోర్టులు వచ్చాక సదరు వ్యక్తులకు సమాచారం ఇవ్వాలి. చివరకు జీనోమ్​సీక్వెన్సింగ్‌లో పాజిటీవ్ తేలితే అప్పుడు హడవిడి చేస్తూ బాధితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.



Next Story

Most Viewed