మాల్దీవుల నుంచి భారత్‌కు..

by  |
మాల్దీవుల నుంచి భారత్‌కు..
X

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సముద్రమార్గం ద్వారా స్వదేశానికి తీసుకొచ్చే ఉద్దేశంతో భారత నావికాదళం ఆపరేషన్ సముద్ర సేతును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకున్న 698మంది భారతీయులను ఐఎన్ఎస్ జలశ్వా నౌక ఆదివారం కేరళలోని కొఛ్చి రేవుకు సురక్షితంగా చేర్చింది. వీరిలో 14మంది చిన్నారులు, 19మంది గర్భిణులు కూడా ఉన్నారు. కాగా, వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ నెల 8న మాల్దీవుల రాజధాని మాలె నుంచి బయల్దేరిన జలశ్వా.. ఉదయం 9:45 గంటలకు కొచ్చి తీరానికి చేరుకుంది. ఇన్ని రోజులూ మాల్దీవుల్లో చిక్కుకుని ఎట్టకేలకూ స్వదేశానికి చేరుకోవడం పట్ల భారత పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు. తామిప్పుడు సురక్షితంగా ఉన్నామన్న భావన కలుగుతోందని తెలిపారు. ప్రయాణ సమయంలో తమ బాగోగులు చూసుకున్న నేవీ సిబ్బందికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, తరలింపునకు వీరి వద్ద 40 అమెరికా డాలర్ల చొప్పున వసూలు చేసినట్టు మాల్దీవుల్లోని భారత హైకమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా, మాల్దీవుల్లో ఉన్న 27వేల మంది భారతీయుల్లో 4వేల మంది స్వదేశానికి రావడానికి తమపేర్లను నమోదు చేసుకోగా, వీరిలో 698మంది చేరుకున్నారు. మిగతావారిని తీసుకొచ్చేందుకు మరో యుద్ధనౌక ఐఎన్ఎస్ మాగర్ ఆదివారంలోపు మాలెకు చేరుకోనున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed