సామాజిక సేవకు దక్కిన గుర్తింపు..

by  |
సామాజిక సేవకు దక్కిన గుర్తింపు..
X

దిశ, కరీంనగర్:
దేశం మొత్తం కరోనా ఫీవర్‌తో వణికిపోతున్న సమయంలో ఉపాధి కోల్పొయిన వారిని, నిరుపేదలను ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పలువురు మానవతా ధృక్పథంతో ముందుకు వచ్చారు. లాక్‌డౌన్ సమయంలో తినడానికి తిండిలేక బాధపడుతున్నవారికి తామున్నామని ధైర్యం చెప్పడమే కాకుండా కుటుంబానికి సరిపడా నిత్యావసర వస్తువులు సరఫరా చేశారు. మరికొందరు కరోనా నుంచి ఎలా బయటపడాలని అవగాహన కల్పించారు.అలాంటి వారిలో నవతెలంగాణ యువజన సంక్షేమ సంఘం కూడా ఒకటి. వీరు అందించిన సేవా కార్యక్రమాలను గుర్తించిన శాంతి సహాయ్ సేవా సమితి వారు పురస్కారం ప్రకటించారు.వివరాల్లోకి వెళితే..విపత్కర సమయంలో సామాన్య జనం పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు వారికి బాసటగా నిలవడంతో పాటు, కరోనా నివారణకు ప్రజల్లో చైతన్యం నింపేలా నవతెలంగాణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిజిగిరి నవీన్‌ విశేషంగా కృషి చేశారు. విషయం తెలుసుకున్న శాంతి సేవా సమితి వారు అతనికి పురస్కారం ప్రకటించారు.ఆదివారం ఫౌండర్ డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతి గుప్త నవీన్‌ను సత్కరించి సర్టిఫికెట్ ప్రదానం చేశారు.

Next Story

Most Viewed