సమిష్టి ప్రయత్నాలతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్

by Disha Web Desk 7 |
సమిష్టి ప్రయత్నాలతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్
X

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి ప్రయత్నాలతోనే భారత్ అభివృద్ది చెందిన దేశాల మార్గాన వెళుతుందని అన్నారు. కర్ణాటక పర్యటనలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనేక మంది ఇంత తక్కువ కాలంలో దేశాన్ని ఎలా అభివృద్ది చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి చాలా సవాళ్లు, చేయాల్సిన పనులు ఉన్నాయి. అయితే ప్రతిఒక్కరి ప్రయత్నాలతో ఇది సాధ్యమైంది. ప్రతి భారతీయుడి ఉమ్మడి ప్రయత్నాలతోనే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది’ అని ప్రధాని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో నిజాయితీ పనిచేసేందుకు కృషి చేశామన్నారు.

దేశంలో వైద్య విద్యకు సంబంధించిన అనేక సంస్కరణలు జరిగాయని తెలిపారు. ప్రభుత్వమైనా, ప్రైవేట్ రంగమైనా, సామాజిక రంగమైనా, సాంస్కృతిక కార్యకలాపమైనా తమ ప్రభుత్వం వచ్చాక ప్రయత్న ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. 2014 సంవత్సరంలో మన దేశంలో 380 కంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నాయని.. నేడు ఆ సంఖ్య 650‌కి పైగా పెరిగాయని చెప్పారు. అదే క్రమంలో 7 నుంచి 22 ఎయిమ్స్‌లు వచ్చాయని తెలిపారు. మరోవైపు బెంగళూరు వైట్ ఫీల్డ్ నుంచి కృష్ణరాజపురుం వరకు రూ.4,249 కోట్లతో నిర్మించిన మెట్రో స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది, కార్మికులు, విద్యార్థులతో కలసి రైలులో పర్యటించారు.


Next Story

Most Viewed