వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలి: విప్రో!

by Disha Web Desk 10 |
వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలి: విప్రో!
X

బెంగళూరు: దేశీయ నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులందరూ ఈ నెల నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు కంపెనీ ఉద్యోగుల ఇష్టానికి అనుగుణంగా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తోంది. ఈ విధానంలో ఉద్యోగులు తమకు నచ్చిన సమయంలో ఆఫీసులో పనిచేసుకోవచ్చు. తాజాగా దీన్ని రద్దు చేస్తూ తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చెసింది. ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా కంపెనీ సమాచారం అందజేసింది. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని విప్రో పేర్కొంది. ఒకవేళ ఎవరైన ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కంపెనీ పాలసీ నిబంధనల ఆధారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఉద్యోగులు ఆఫీసులకు రావడం మూలంగా టీమ్ స్పిరిట్, తోటి ఉద్యోగులతో సంబంధాల ద్వారా ఉత్పాదతకను పెంచుతాయని కంపెనీ భావిస్తోంది.


Next Story