కోర్టు అనుమతిస్తే.. జైల్లోనే కేజ్రీవాల్‌కు సీఎం ఆఫీస్ : మాన్‌

by Dishanational4 |
కోర్టు అనుమతిస్తే.. జైల్లోనే కేజ్రీవాల్‌కు సీఎం ఆఫీస్ : మాన్‌
X

దిశ, నేషనల్ బ్యూరో : జైలు నుంచే ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనను కొనసాగిస్తారని ఆప్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా శనివారం సాయంత్రం ఆప్ సీనియర్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ అదే తరహా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కేజ్రీవాల్‌ విడుదలయ్యే దాకా జైలు నుంచే ఢిల్లీని పరిపాలిస్తారు. జైల్లో సీఎం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం’’ అని ఆయన చెప్పారు.‘‘జైలు నుంచి ముఖ్యమంత్రి పరిపాలన చేయకూడదని ఎక్కడా చెప్పలేదు. అయితే జైలుకు వెళ్లినంత మాత్రాన ఏ వ్యక్తి కూడా నేరస్థుడు కాడని చట్టం చెబుతోంది. ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు జైల్లోనే కార్యాలయం ఏర్పాటు చేయించాలని సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం’’ అని భగవంత్‌ మాన్‌ తెలిపారు. ఆమ్‌ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్‌ స్థానాన్ని ఏ ఒక్కరూ భర్తీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. ఇక కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన చేయడం సాధ్యమయ్యే విషయమేనని న్యాయ నిపుణులు అంటున్నారు.



Next Story

Most Viewed