యువరైతు మృతిపై వెంకయ్యనాయుడు స్పందన.. కేంద్రానికి కీలక విజ్ఙప్తి

by Disha Web Desk 2 |
యువరైతు మృతిపై వెంకయ్యనాయుడు స్పందన.. కేంద్రానికి కీలక విజ్ఙప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యాణాలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల్లో యువరైతు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ ఘటనపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. రైతుల ఆందోళనలో యువరైతు దుర్మరణం చెందడం బాధాకరమని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకుండా ప్రభుత్వం, రైతులు చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూసుకోవాలని కోరారు.

కాగా, ఇటీవల పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ సహా పలు డిమాండ్లపై రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్యాణాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల చేతిలో శుభకరణ్ అనే యువరైతు మరణించినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. ఖనౌరీ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి నిరసన తెలుపుతున్న రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో 21 ఏళ్ల రైతు మరణించగా.. మరికొంత మంది గాయపడినట్లు కర్షక సంఘ నేతలు తెలిపారు. ఫిబ్రవరి 13న ఢిల్లీ ఛలో మార్చ్‌ ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన ఘర్షణల్లో ఇదే తొలి మరణమని వెల్లడించారు.


Next Story

Most Viewed