రష్యా మిలిటరీ అపరేషన్ యూఎస్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు

by Disha Web Desk 10 |
రష్యా మిలిటరీ అపరేషన్ యూఎస్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు
X

కీవ్: ఉక్రెయిన్‌తో రష్యా యుద్దాన్ని ఉద్దేశించి అమెరికా విదేగాంగ మంత్రి అంటోని బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ప్రారంభమై ఏడాది కావొస్తున్న నేపథ్యంలో రష్యా అణ్వాయుధ ప్రయోగాన్ని భారత్, చైనా దేశాలు అడ్డుకుని ఉండవచ్చని అభివప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీ20 సమావేశాల్లో భాగంగా భారత్ పర్యటనకు ముదు ఆయన మీడియాతో మాట్లాడారు. యుద్ధభూమిలో రష్యా అణ్వాయుధాల విక్రయాన్ని అడ్డకునేందుకు చైనా, భారత్‌లు ప్రభావం చూపాయని చెప్పారు. రష్యాతో భారత్ కు ఏళ్లుగా బంధం ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ఒకప్పుడు రష్యా భారత్‌కు రక్షణ ఎగుమతులు ఎక్కవగా ఉండేవని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని చెప్పారు. యూఎస్ మిత్ర దేశాలు ఫ్రాన్స్ వంటి దేశాలతో భాగస్వామ్యం అధికంగా ఉందని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌కు భారతదేశం, చైనా దూరంగా ఉన్నాయి, ఇది సంఘర్షణకు ఒక సంవత్సరం వార్షికోత్సవం. తీర్మానానికి అనుకూలంగా 141 మంది సభ్యులు ఓటు వేయగా, ఏడుగురు వ్యతిరేకించారు. 32 మంది సభ్యుల్లో భారత్, చైనాలు గైర్హాజరయ్యాయి. ‘భారతదేశం బహుపాక్షికతకు స్థిరంగా కట్టుబడి ఉంది. ఐరాస సూత్రాలను సమర్థిస్తుంది. మేము ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యం మాత్రమే ఆచరణీయమైన మార్గంగా పిలుస్తాము.తాజా తీర్మానాన్ని స్వాభావిక పరిమితులను పరిగణనలోకి తీసుకుంటాము. శాశ్వత శాంతిని సురక్షితమైన లక్ష్యం’ అని ఐరాస శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు.



Next Story

Most Viewed